వినేష్ ఫోగట్ కు అస్వస్థత ఆస్పత్రిలో చేరిక
అధిక బరువు నెపంతో అనర్హత వేటు
ఫ్రాన్స్ – పారిస్ ఒలింపిక్స్ 2024లో భాగంగా జరిగిన పరీక్షల్లో 100 గ్రాములు ఎక్కువగా ఉందన్న కారణంగా భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు వేయడం కలకలం రేపింది. దీంతో డీ హైడ్రేషన్ కు గురయ్యారు ఫోగట్. ఆమెను హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు.
డీ హైడ్రేషన్ కారణంగా స్పృహ తప్పి పడి పోయినట్లు టాక్. 50 కేజీల రెజ్లింగ్ పోటీలలో సత్తా చాటింది. ఏకంగా ఫైనల్ కు చేరింది ఫోగట్. స్వర్ణ పతకానికి దగ్గరగా వచ్చిన కొన్ని గంటల్లోపే ఆమె పతకాన్ని కోల్పోయింది.
కావాల్సిన బరువు కేటగిరీ కిందకు వచ్చేందుకు శత విధాలుగా ప్రయత్నం చేసింది. భోజనం మానేయడం, తగినంత నీరు తాగక పోవడం ఉన్నారు. ప్రస్తుతం వినేష్ ఫోగట్ ఒలింపిక్ విలేజ్ లోని పాలి క్లినిక్ లో ఉన్నారని, వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిసింది.
ఇదిలా ఉండగా ఆమె కు సంబంధించిన అంశంపై ప్రస్తుతం భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అవసరమైన సాయం చేస్తామని ప్రకటించింది. ఇవాళ క్రీడా శాఖ మంత్రి పీఎంతో మాట్లాడనున్నారు. పీఎం స్వయంగా ఐఓసీ చీఫ్ పీటీ ఉషతో మాట్లాడారు.