బిగ్ షాక్ ఇచ్చిన నిర్వాహకులు
ఫ్రాన్స్ – ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్ కు బిగ్ షాక్ తగిలింది. భారత్ తరపున ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ 2024 గేమ్స్ లో అద్బుతమైన ప్రదర్శనతో సత్తా చాటింది. రెజ్లింగ్ విభాగంలో జరిగిన పోటీల్లో ఏకంగా ఫైనల్ కు చేరింది.
కాగా ఇవాళ జరిపిన పరీక్షల్లో తను నిర్దేశించిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందని తేలింది. దీంతో వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు వేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. దీంతో భారత దేశానికి ఇది ఊహించని వార్త అని చెప్పక తప్పదు.
ఇప్పటికే తను ఎంతగానో కష్ట పడింది. భారత దేశానికి తన వైపు నుంచి పతకం తీసుకు రావాలని పరితపించింది. అంతే కాదు ఇండియా ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ పై ప్రత్యక్షంగా పోరాటం చేసింది. తను పోలీసుల నుంచి దెబ్బలు కూడా తిన్నది. అయినా పట్టు వదలకుండా ప్రాక్టీస్ చేసింది. చివరకు పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది.
50 కిలోల విభాగంలో టాప్ రెజ్లర్ ను ఓడించింది. రికార్డ్ సృష్టించింది. ఇంతలోనే బరువు కారణంగా అనర్హత వేటుకు గురి కావడం నిరాశకు లోను చేసింది.