NEWSTELANGANA

కాంగ్రెస్ మోసం రైతుల‌కు శాపం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన వినోద్ కుమార్

హైద‌రాబాద్ – ఆరు గ్యారెంటీల పేరుతో జ‌నాన్ని నిట్ట నిలువునా కాంగ్రెస్ ప్ర‌భుత్వం మోసం చేసిందంటూ నిప్పులు చెరిగారు మాజీ ఎంపీ బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్. ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

రైతు భ‌రోసా ఇస్తామ‌ని చెప్పి ద‌గా చేశారంటూ ధ్వ‌జ‌మెత్తారు. హామీల‌ను అమ‌లు చేయ‌డంలో పూర్తిగా విఫలం అయ్యారంటూ ఆరోపించారు. త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌తి ఎక‌రాకు సాగు నీళ్ల‌ను ఇచ్చామ‌ని అన్నారు వినోద్ కుమార్. కానీ ఇప్పుడు కాంగ్రెస్ స‌ర్కార్ నీళ్లు ఇవ్వ‌కుండా వేధింపుల‌కు గురి చేస్తోంద‌ని ఆరోపించారు.

మాయ మాట‌లు చెప్ప‌డంలో కాంగ్రెస్ ఆరి తేరింద‌న్నారు. అందుకే జ‌నం దేశంలో లేకుండా చేసే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని ఎద్దేవా చేశారు. కేవ‌లం మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు సౌక‌ర్యం త‌ప్ప ఏ ఒక్క‌టి అమ‌లు చేసిన దాఖ‌లాలు లేవన్నారు.

మేడిగ‌డ్డ బ్యారేజ్ కుంగిన విష‌యంలో విచార‌ణ చేప‌ట్ట‌డంలో అభ్యంత‌రం ఏమీ లేద‌న్నారు. కానీ మేడిగ‌డ్డ సాకుతో సాగు నీళ్లు ఇవ్వ‌క పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు వినోద్ కుమార్.