NEWSTELANGANA

బీఆర్ఎస్ పేరు మారిస్తే బెట‌ర్

Share it with your family & friends

లేదంటే ఫ్యూచ‌ర్ క‌ష్టంమే

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ లో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైంది. తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీని ఉన్న‌ప‌ళంగా మాజీ సీఎం, పార్టీ బాస్ కేసీఆర్ భార‌త రాష్ట్ర స‌మితి పార్టీగా మార్చేశారు. ఆనాటి నుంచి నేటి దాకా కేసీఆర్ కు షాక్ ల మీద షాక్ లు త‌గులుతున్నాయి. తెలంగాణ పేరుతో ఉద్య‌మాన్ని నిర్వ‌హించి, దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపి, కొత్త రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కు ఉన్న‌ట్టుండి బీఆర్ఎస్ గా మార్చేశాక అన్నీ వ్య‌తిరేక ఫ‌లితాలే వ‌స్తున్నాయి.

త‌న ముద్దుల కూతురు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత లిక్క‌ర్ స్కామ్ లో ఇరుక్కుని జైలు పాల‌య్యారు. ఆమె వ‌స్తుందో రాదో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రో వైపు బీఆర్ఎస్ పార్టీ మీద గెలుపొందిన వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ క‌ట్టారు.

రోజు రోజుకు పార్టీలో ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇదిలా ఉండ‌గా పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎంపీ బోయిన్ ప‌ల్లి వినోద్ కుమార్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ను మార్చేశాక తెలంగాణ‌లోని నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జానీకంతో పేగు బంధం తెగి పోయింద‌న్నారు. తిరిగి టీఆర్ఎస్ గా మారిస్తే త‌ప్పా బ‌లం పుంజు కోలేమంటూ వాపోయారు.