NEWSTELANGANA

చ‌రిత్ర‌ను క‌నుమ‌రుగు చేస్తే ఖ‌బ‌డ్దార్

Share it with your family & friends

నిప్పులు చెరిగిన వినోద్ కుమార్

హైద‌రాబాద్ – మాజీ ఎంపీ వినోద్ కుమార్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సీఎం హోదాలో ఉండి తెలంగాణ చ‌రిత్ర‌ను క‌నుమ‌రుగు చేసేందుకు కుట్ర ప‌న్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ధ‌తి కాద‌న్నారు .

రాష్ట్ర చిహ్నం నుంచి కాక‌తీయ తోర‌ణం, చార్మినార్ ల‌ను తొల‌గిస్తే చూస్తూ ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు వినోద్ కుమార్ . మంత్రులు కొండా సురేఖ‌, దాస‌రి \సీత‌క్క వెంట‌నే స్పందించాల‌ని డిమాండ్ చేశారు.

తెలంగాణ వ్యతిరేక శక్తుల డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి పని చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయ‌ని వాపోయారు. కాకతీయుల కాలంలో త్రికుట ఆలయాలు, కట్టడాలు చేశార‌ని ఆ మాత్రం చ‌రిత్ర తెలుసుకోక పోతే ఎలా అని వినోద్ కుమార్ ప్ర‌శ్నించారు.

800 ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయుల చరిత్రను కనుమరుగు చేసే కుట్రకు తెరతీస్తున్నార‌నే అనుమానం క‌లుగుతోంద‌న్నారు.