ఇదే నా చివరి వరల్డ్ కప్
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ
బ్రిడ్జ్ టౌన్ – వెస్టిండీస్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ లో భారత జట్టు దక్షిణాఫ్రికాను ఓడించింది. విశ్వ విజేతగా నిలిచింది. ఈ సందర్బంగా రన్ మెషీన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన చేశాడు. తాను ఇక నుంచి టి20 క్రికెట్ ఆడడం లేదంటూ తెలిపాడు.
ఇదిలా ఉండగా ఈసారి జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు అప్రహతితంగా విజయాలు సాధిస్తూ వచ్చింది. ఏ ఒక్క మ్యాచ్ ఓడి పోలేదు. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 రన్స్ చేసింది. ఓ వైపు వికెట్లు కూలుతున్నా ఎక్కడా తల వంచ లేదు విరాట్ కోహ్లీ. 76 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు.
అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. టోర్నీ విజేతగా నిలిచిన జట్టుతో సంబురాలు చేసుకున్న కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదే తన చివరి వరల్డ్ కప్ టోర్నీ అంటూ ప్రకటించాడు. భారత జట్టు విజయాలలో పాలు పంచుకున్నాడు. తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు విరాట్ కోహ్లీ.
విరాట్ కోహ్లీ తను తప్పుకుంటున్నట్లు చెప్పండంతో కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు.