రన్ మెషీన్ సెన్సేషన్
జాక్స్ తో కలిసి సూపర్ షో
గుజరాత్ – విరాట్ కోహ్లీ మరోసారి తనదైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2024 లో అత్యధిక పరుగులు చేసి టాప్ లో కొనసాగుతుండగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తనకు పోటీలో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.
తాజాగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక లీగ్ పోరులో 9 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 200 రన్స్ చేసింది. సాయి సుదర్శన్ 84 రన్స్ తో రెచ్చి పోతే షారుక్ ఖాన్ 58 పరుగులతో దంచి కొట్టాడు.
అనంతరం మైదానంలోకి దిగిన ఆర్సీబీ 24 పరుగుల వద్ద ఉండగా ఫాఫ్ డుప్లెసిస్ 24 రన్స్ కే తిరుగు ముఖం పట్టాడు. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తనదైన శైలితో ఆడటం మొదలు పెట్టాడు. విల్ జాక్స్ తో కలిసి 133 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
జాక్స్ 100 పరుగులతో సెంచరీ చేసి దంచి కొడితే విరాట్ కోహ్లీ తానేమీ తీసిపోనంటూ 70 రన్స్ చేశాడు. విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా ఆర్సీబీ ఈ విజయంతో ప్లే ఆఫ్స్ పై ఆశలు పెట్టుకుంది. ఇక ఆర్ఆర్ ఇప్పటికే 16 పాయింట్లతో టాప్ లో కొనసాగుతోంది.