ఆసిస్ రిపోర్టర్ తో కోహ్లీ వాగ్వాదం
సోషల్ మీడియాలో వైరల్
మెల్బోర్న్ – భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కోపం వచ్చింది. ఆస్ట్రేలియన్ రిపోర్టర్లతో వాగ్వివాదానికి దిగడంతో వివాదానికి కేంద్రబిందువుగా కనిపించాడు. కోహ్లి తన భార్య, నటి అనుష్క శర్మతో కలిసి మెల్బోర్న్లో దిగిన సందర్భంగా గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆస్ట్రేలియాకు చెందిన ఛానల్ 7కి చెందిన ఒక జర్నలిస్ట్ కుటుంబ సభ్యుల వీడియోను తీయడంతో కోహ్లీ ఆస్ట్రేలియన్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన గోప్యతకు భంగం కలిగించడం పట్ల అతను ప్రత్యేకంగా కలత చెందాడు. ఆ తర్వాత కోహ్లి జర్నలిస్టులను సంప్రదించి ముందస్తు అనుమతి లేకుండా తన కుటుంబాన్ని చిత్రీకరించడం పట్ల ఫైర్ అయ్యారు. ఇది మంచి పద్దతి కాదన్నాడు.
నా కుటుంబంతో వెళుతున్న సమయంలో మీరు నా పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలన్నాడు కోహ్లీ. కాగా ఆస్ట్రేలియన్ చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో సెలబ్రిటీలను చిత్రీకరించడంపై ఎలాంటి పరిమితులు లేవు, ఇది సంక్లిష్టతకు దారి తీసింది.
విరాట్ కోహ్లీ బ్రిస్బేన్ నుండి మెల్బోర్న్ వరకు మిగిలిన పరివారంతో కలిసి ప్రయాణించలేదు. నాల్గవ టెస్ట్‌కు ముందు పర్యటన సందర్భంగా భారత మాజీ కెప్టెన్ తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్నాడు.
ముఖ్యంగా, ఇద్దరు కీలకమైన భారత ఆటగాళ్లు, కోహ్లీ , జస్ప్రీత్ బుమ్రా ఈ పర్యటనలో వారి కుటుంబాలతో విడివిడిగా ప్రయాణించారు.
కోహ్లీ తన ఫామ్‌తో చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నాడు. కోహ్లి ఆరు ఇన్నింగ్స్‌ల్లో 30 సగటుతో కేవలం 126 పరుగులు మాత్రమే చేశాడు. పెర్త్ టెస్టులో సెంచరీ మినహా, కోహ్లీ ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు.