SPORTS

ఆర్సీబీ స్కిప్ప‌ర్ గా విరాట్ కోహ్లీ

Share it with your family & friends

వ‌చ్చే 2025 ఐపీఎల్ లో కీల‌కం

హైద‌రాబాద్ – భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని తిరిగి తీసుకుంది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు. బుధ‌వారం జ‌రిగిన ఆర్సీబీ మేనేజ్మెంట్ కీల‌క స‌మావేశంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. వ‌చ్చే ఏడాది 2025లో జ‌రిగే ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్)లో ఆర్సీబీ నుంచి విరాట్ కోహ్లీ మ‌రోసారి ప్రాతినిధ్యం వ‌హిస్తాడ‌ని వెల్ల‌డించింది.

ఇదే స‌మ‌యంలో కింగ్ కోహ్లీని తిరిగి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు కెప్టెన్ గా కూడా నియ‌మించిన‌ట్లు తెలిపింది. గ‌త ఏడాదితో పాటు ఈ ఏడాది జ‌రిగిన ఐపీఎల్ లో ఆర్సీబీ త‌న‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించింది. అయితే అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నా చివ‌ర‌కు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ ఆశించిన మేర ఫైన‌ల్స్ కు రాలేక పోయింది.

దిగ్గ‌జ ఆట‌గాళ్లు ఉన్న‌ప్ప‌టికీ ఆర్సీబీ టోర్నీ నుంచి నిష్క్ర‌మించ‌డం అభిమానుల‌ను నిరాశ ప‌రిచింది. ఈ త‌రుణంలో మ‌రోసారి తీపిక‌బురు చెప్పింది ఆర్సీబీ యాజ‌మాన్యం . తిరిగి కోహ్లీకే నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది . ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా చేసింది.