సంచలన కామెంట్స్ చేసిన విరాట్ కోహ్లీ
భారత క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన చేశారు. తాను రిటైర్ అవుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించాడు. తనలో ఇంకా ఆడే సత్తా ఉందన్నాడు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నాడు. ఒన్డే ఫార్మాట్ లో దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్ షిప్ లో సత్తా చాటానని , ఇంతకంటే ఇంకేం కావాలంటూ ప్రశ్నించాడు. ఇప్పట్లో తాను ఒన్డే ఫార్మాట్ నుంచి తప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా గత ఏడాది విండీస్ లో ముగిసిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను భారత్ కైవసం చేసుకుంది. అనంతరమే ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు విరాట్ కోహ్లీ.
ఇదిలా ఉండగా రన్ మెషీన్ చిట్ చాట్ చేశాడు. ఈ సందర్బంగా తన ఆలోచనలు, అభిప్రాయాలను, భవిష్యత్తు కార్యక్రమాల గురించి పంచుకున్నాడు. తనపై వస్తున్న విమర్శలను తాను పట్టంచుకోనని అన్నాడు. తన దృష్టి అంతా కేవలం ఆటపైనే ఉంటుందన్నాడు. తనను కోట్లాది మంది అభిమానంగా చూస్తారని, వారి ఆశలు సజీవంగా ఉండేందుకు తాను ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటానని స్పష్టం చేశాడు. ఇదే సమయంలో తన సహచరుడు , స్కిప్పర్ రోహిత్ శర్మ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. తన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు తాను క్రికెట్ ఆడుతూనే ఉంటానని చెప్పాడు కోహ్లీ.