ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ
దుబాయ్ – స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా ఫామ్ లేమితో బాధ పడుతున్న తను దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో చెలరేగి పోయాడు. 111 బంతులు ఎదుర్కొని అజేయంగా 100 రన్స్ చేశాడు. తనకు ఇష్టమైన షాట్ కవర్ డ్రైవ్ అని , ఇదే తనకు బలహీనతగా మారిందని వాపోయాడు. ఈ షాట్ ను ఆడేందుకు ప్రయత్నం చేసినప్పుడల్లా తాను క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాల్సి వస్తోందన్నాడు.
మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడాడు విరాట్ కోహ్లీ. తాను పరుగులు చేయడంపై ఫోకస్ పెట్టనని చెప్పాడు. కేవలం జట్టును దృష్టిలో పెట్టుకుని ఆడతానని, ప్రత్యర్థి ఎవరనే దానిని కూడా పట్టించుకోనని స్పష్టం చేశాడు స్టార్ క్రికెటర్.
ఇదిలా ఉండగా విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్ లో అరుదైన ఘనతను సాధించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో మూడో స్థానంలో చేరాడు. ఇప్పటి వరకు 51 సెంచరీలు చేశాడు. 14000 పరుగులు పూర్తి చేశాడు. సచిన్ టెండూల్కర్ సరసన నిలిచాడు.