స్మితా కామెంట్స్ విశారదన్ సీరియస్
నిప్పులు చెరిగిన డీఎస్పీ అధ్యక్షుడు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ దివ్యాంగుల పట్ల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. విభిన్న ప్రతిభావంతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఐఏఎస్ కోచింగ్ మెంటార్ , మాజీ ఏఐఎస్ బాల లత ముల్లవరపు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని డిమాండ్ చేశారు. మరో వైపు బక్క జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.
ఈ మొత్తం వ్యవహారంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు డీఎస్పీ అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ . ట్విట్టర్ వేదికగా స్మితా సబర్వాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన వికలాంగురాలు ఆమెనేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. బేషరతుగా స్మితా సబర్వాల్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మరో వైపు శివసేన ఎంపీ ప్రియాంక చౌదరి సీరియస్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా స్మితా సబర్వాల్ ను ఏకి పారేశారు. వికలాంగులు కూడా మనుషులేనని ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా బాధ్యత కలిగి ఉండాలే తప్పా ఇలా పరిధి దాటి కామెంట్స్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు.