విశాఖ డెయిరీ చైర్మన్ రాజీనామా
వైఎస్సార్సీపీకి కోలుకోలేని షాక్
అమరావతి – వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. విశాఖ డెయిరీ చైర్మన్ గా ఉన్న ఆనంద్ కుమార్ తో పాటు మరో 9 మంది డైరెక్టర్లు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. డెయిరీ అభివృద్ది కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వైసీపీకి క్యూ కట్టారు నేతలు.
విశాఖ డైరీ అభివృద్ధి కొరకు పూర్తిస్థాయి సమయాన్ని కేటాయించేందుకు ఆడారి ఆనంద్ కుమార్ వైకాపాకు రాజీనామా చేసినట్లు తెలిసింది. ఇదే రీతిలో డైరెక్టర్లుగా కొనసాగుతున్న 9 మంది వైఎస్సార్ పార్టీకి రాజీనామా చేశారు.
జగన్ పార్టీకి గుడ్ బై చెప్పిన వారిలో శరగడం వరాహ వెంకట శంకర్రావు , పిల్లా రమా కుమారి , శీరంరెడ్డి సూర్యనారాయణ , కోళ్ల కాటమయ్య , దాడి పవన్ కుమార్ , ఆరంగి రమణబాబు, చిటికెల రాజకుమారి , రెడ్డి రామకృష్ణ , సుందరపు ఈశ్వర్ , పరదేశి గంగాధర్ లు ఉన్నారు.
వీరంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి రాజీనామా పాత్రలు పంపించారు.