పెట్టుబడులు సరే కంపెనీలు ఎక్కడ..?
నిప్పులు చెరిగిన డీఎస్పీ చీఫ్ విశారదన్
హైదరాబాద్ – ధర్మ సమాజ్ పార్టీ చీఫ్ డాక్టర్ విశారదన్ మహారాజ్ నిప్పులు చెరిగారు. ఎవరి కోసం అమెరికా వెళ్లారో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ వైపు పాలన గాడి తప్పిందని, ఇచ్చిన ఆరు గ్యారెంటీల ఊసే లేదన్నారు.
పదే పదే కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయంటూ జనాన్ని ఊరిస్తున్నారని, ఇప్పటి దాకా ఎన్ని కంపెనీలు వచ్చాయో..ఎవరెవరికి విలువైన భూములు ధారదత్తం చేశారో చెప్పాలన్నా డాక్టర్ విశారదన్ మహారాజ్.
పోనీ పెట్టుబడులు ఎక్కడికి వెళుతున్నాయి..? అవి ఎవరి కోసం , ఎవరి ప్రయోజనాల ప్రాతిపదికన కేటాయించారో చెప్పాలన్నారు. ఈ కంపెనీలు ఎక్కడ ఏర్పాటు చేస్తారు..అవి పర్యావరణాన్ని కాపాడతాయా లేక తమ ప్రాఫిట్ ను మాత్రమే చూసుకుంటాయా అన్నది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు డాక్టర్ విశారదన్ మహారాజ్.
సీఎం తన స్వంత భూములు ఇస్తున్నారా లేక ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు చెందిన భూములు ఎన్ని ఇచ్చారో చెప్పాలన్నారు. మోస పూరిత ప్రకటనలు మానుకోవాలని సూచించారు .