NEWSTELANGANA

రెడ్ల‌కు అంద‌లం బ‌హుజ‌నుల‌కు మంగ‌ళం

Share it with your family & friends

ధ‌ర్మ స‌మాజ్ పార్టీ చీఫ్ విశార‌ద‌న్ మ‌హారాజ్

హైద‌రాబాద్ – రాష్ట్రం పూర్తిగా రెడ్ల చేతుల్లోకి పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ధ‌ర్మ స‌మాజ్ పార్టీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ విశార‌ద‌న్ మ‌హారాజ్. బుధ‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఆయ‌న పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డికి కీల‌క ప‌ద‌వులు అప్ప‌గించ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. పాలు పిండ‌డం రాని అమిత్ రెడ్డికి పాడి ప‌రిశ్ర‌మ అభివృద్ది చైర్మ‌న్ ఎలా ఇస్తారంటూ ప్ర‌శ్నించారు. ఇక భూమి దున్న‌ని, స్వేదం చిందించ‌ని పోచారం శ్రీ‌నివాస్ రెడ్డికి వ్య‌వ‌సాయ శాఖ స‌ల‌హాదారుడి ప‌ద‌వి ఏ ప్రాతిప‌దిక‌న ఇచ్చారో చెప్పాల‌ని నిల‌దీశారు సీఎంను.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్ర జ‌నాభాలో 4 శాతం లేని రెడ్ల‌కు 90 శాతం ప‌ద‌వులు ఇచ్చాడ‌ని ఆరోపించారు. 90 శాతం జ‌నాభా ఉన్న పీడితుల‌కు క‌నీసం 4 శాతం ప‌ద‌వులు ఇవ్వ‌లేద‌ని ఇదేమి న్యాయ‌మ‌ని ప్ర‌శ్నించారు డాక్ట‌ర్ విశార‌ద‌న్ మహారాజ్.

పాడి, పంటల్ని ప్రపంచానికి పరిచయం చేసిన యాదవ, గొల్ల సోదరులకు పాడి పరిశ్రమ ఛైర్మెన్ ఇవ్వకూడదా అని మండిప‌డ్డారు. వ్యవసాయ కూలీలుగా గొడ్డు చాకిరి చేసిన ఓ దళిత కూలీ నాయకుడి కి వ్యవసాయ శాఖ సలహాదారుడి పదవి ఇవ్వడానికి..సీఎంకు మనసు రాలేదా అని నిప్పులు చెరిగారు.