బీజేపీ నేత విష్ణు వర్దన్ రెడ్డి కామెంట్స్
అమరావతి – ఏపీ బీజేపీ నేత విష్ణు వర్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ప్రజా గాయకుడు గద్దర్ గురించి నోరు పారేసుకున్నారు. నర హంతకులు ఎల్టీటీఈ ప్రభాకర్ , నయీమ్ లతో గద్దర్ ను పోల్చాడు. భారత రాజ్యాంగం పట్ల నమ్మకం లేని గద్దర్ కు పద్మ పురస్కారం ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
దేశాన్ని విచ్చిన్నం చేసే శక్తులతో అంటకాగిన గాయకుడికి అవార్డు ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. గద్దర్ మావోయిస్ట్ కు చెందిన లీడర్ అంటూ ఆరోపించారు. గద్దర్ కూతురు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని పురస్కారం ఇవ్వాలా అని ప్రశ్నించారు.
విష్ణు వర్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అలాగని దివంగత రాజీవ్ గాంధీని చంపిన వాళ్లకు కూడా జాతీయ స్థాయి అవార్డులు ఇవ్వమంటారా అని నిలదీశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. మరో వైపు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజా యుద్ద నౌక గద్దర్ పై.
బీజేపీ కావాలని తనపై నోరు పారేసుకుంటోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇదే సమయంలో తెలంగాణ సాంస్కృతిక సమితి చైర్ పర్సన్ , గద్దర్ కూతురు వెన్నెల గద్దర్ నిప్పులు చెరిగారు. గద్దర్ గురించి మాట్లాడే నైతిక హక్కు బండికి లేదన్నారు. నోరు జర జాగ్రత్త అంటూ హెచ్చరించారు.