ఆ నలుగురి వల్లే నా కొడుకు కెరీర్ పై ఎఫెక్ట్
సంజూ శాంసన్ తండ్రి షాకింగ్ కామెంట్స్
కేరళ – కేరళ క్రికెటర్ సంజూ శాంసన్ తండ్రి శాంసన్ విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. తన కొడుకు ఎంతో కష్ట పడ్డాడని, కానీ తన 10 ఏళ్ల కెరీర్ ను కావాలని నాశనం చేశారంటూ సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపింది.
ఆ నలుగురు ఎవరో కాదు ప్రపంచ క్రికెట్ రంగంలో మోస్ట్ పాపులర్ పొందిన వాళ్లు కావడం విశేషం. దశాబ్ద కాలంలో మాజీ భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ , మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డాడడని వాపోయారు. వీరి నిర్వాకం కారణంగానే సంజూ శాంసన్ కు అవకాశాలు రాకుండా పోయాయని ఆవేదన చెందారు.
అయితే సంజూ శాంసన్ కు రాహుల్ ద్రవిడ్ అంటే అభిమానం. తనపై కూడా తీవ్ర స్థాయిలో నిందలు మోపడం విస్తు పోయేలా చేసింది. ఆ నలుగురు చాలా ఇబ్బందులకు గురి చేశారు. వారు ఎంతగా హీనంగా చూశారో అంతకంటే బలంగా శాంసన్ తయారయ్యాడని పేర్కొన్నారు శాంసన్ విశ్వనాథ్. మలయాళీ వార్తా సంస్థ మీడియా వన్ తో జరిగిన చిట్ చాట్ లో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే శాంసన్ కు పూర్తి మద్దతు లభించింది కోచ్ గౌతమ్ గంభీర్ , కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ నుంచి