వివేక్ రామస్వామి షాకింగ్ కామెంట్స్
బ్యూరోక్రాటిక్ రూల్స్ తొలగించడం కష్టం
అమెరికా – ప్రవాస భారతీయుడు, ట్రంప్ టీంలో కీలక సభ్యుడు వివేక్ రామస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు అమెరికా రాజ్యాంగంలో పొందు పర్చిన బ్యూరోక్రాటిక్ రూల్స్ ను తొలగించాలన్న వాదన పెద్ద ఎత్తున కొనసాగుతోంది. దీనికి ప్రధాన మద్దతుదారుగా ఉన్నారు టెస్లా చైర్మన్, ఎక్స్ చీఫ్ , స్టార్ లింక్ అధిపతి ఎలాన్ మస్క్.
ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించారు వివేక్ రామస్వామి. బ్యూరోక్రాటిక్ నిబంధనలను తొలగించడం అనేది కేవలం విధాన ప్రాధాన్యత కాదని పేర్కొన్నారు. ఇది అమెరికా సుప్రీంకోర్టు నుండి చట్ట పరమైన ఆదేశం రావాల్సి ఉందన్నారు.
వెస్ట్ వర్జీనియా వర్సెస్ వీపీఏ (2022) ప్రకారం స్పష్టమైన కాంగ్రెస్ అధికారం లేకుండా ఆర్థిక లేదా రాజకీయ ప్రాముఖ్యత కలిగిన ప్రధాన ప్రశ్నలను ఏజెన్సీలు నిర్ణయించ లేవని స్పష్టం చేశారు వివేక్ రామస్వామి.
ఏజన్సీలు చట్టానికి సంబంధించిన వారి స్వంత వివరణలను అమెరికన్ ప్రజలకు అందించ లేవన్నారు. 18,000 కంటే ఎక్కువ ఫెడరల్ కేసులు చెవ్రాన్ సిద్ధాంతాన్ని ఉదహరించారు. తరచుగా నిబంధనలను సమర్థించాయని పేర్కొన్నారు.
యుఎస్ ప్రభుత్వం మరోసారి అమెరికా రాజ్యాంగానికి అనుగుణంగా సహాయం చేయడానికి డోగ్ (DOGE )సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇందుకు తాను కూడా పూర్తి మద్దతు ఇస్తానని ప్రకటించారు వివేక్రామస్వామి.