ఏపీ సీఈవోగా వివేక్ యాదవ్
ఉత్తర్వులు జారీ చేసిన ఎన్నికల కమిషన్
అమరావతి – ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరాక సీనియర్ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు బదిలీ అవుతున్నారు. డైనమిక్ సీఎంగా పేరు పొందిన నారా చంద్రబాబు నాయుడు పాలనా పరంగా పరుగులు పెట్టించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన సమీక్షలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే పని చేసే వారి జాబితాను ఆయన తయారు చేసుకున్నారు.
నిబద్దతతో పని చేస్తారని పేరు పొందిన సీనియర్లను ఏరికోరి నియమిస్తున్నారు. కాదంటే కేంద్రంతో మాట్లాడుతున్నారు. మరికొందరిని డిప్యూటేషన్ పై తీసుకు వస్తున్నారు. తాజాగా ఏపీ ఎన్నికల సంఘంకు ఇప్పటి వరకు కీలకమైన బాధ్యతలు చేపట్టారు ముకేష్ కుమార్ మీనా. ఆయన ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారన్న పేరు తెచ్చుకున్నారు.
ఈ సమయంలో ఉన్నట్టుండి ఆయనను బదిలీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వివేక్ యాదవ్ ను నియమించింది. ఈ మేరకు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా ఊహించని రీతిలో ఏపీ సర్కార్ ఏకంగా 19 మంది ఏఐఎస్ ఆఫీసర్లను బదిలీ చేసింది.