NEWSANDHRA PRADESH

ఒక్కో కుటుంబానికి రూ. కోటి ప‌రిహారం

Share it with your family & friends

ప్ర‌క‌టించిన విశాఖ జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రేంద‌ర్ ప్ర‌సాద్

అమరావ‌తి – అన‌కాప‌ల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో చోటు చేసుకున్న ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌లనం సృష్టించింది. ఫార్మా కంపెనీలో పేలుడు ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో ఏకంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కంపెనీకి ఇద్ద‌రు య‌జ‌మానులు ఉండ‌డం, వారి మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఘ‌ట‌న‌కు సంబంధించి 50 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిని హుటా హుటిన విశాఖ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం చికిత్స కొన‌సాగుతోంది యుద్ద ప్రాతిప‌దిక‌న‌. ఈ ఘ‌ట‌న‌పై సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉండ‌గా విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రేందిర ప్ర‌సాద్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అచ్యుతాపురం సెజ్‌ ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబీకులతో ఆయ‌న‌ మాట్లాడారు.

మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లిస్తామని కలెక్టర్‌ ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేసామని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యుల‌పై క‌ఠిన చర్యలు తీసుకుంటామని స్ప‌ష్టం చేశారు. ఇవాళ ఘ‌ట‌నా స్థలానికి సీఎం చంద్ర‌బాబు నాయుడు విచ్చేశారు.