ప్రజా నాయకుడిగా గుర్తింపు
తమిళనాడు – రాష్ట్రంలో రాజకీయాలు శర వేగంగా మారుతున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్దం కొనసాగుతోంది. ప్రస్తుతం జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రధానంగా అధికారంలో ఉన్న సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో డీఎంకేతో కె. అన్నామలై నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ నెలకొంది. ఒకరిపై మరొకరు మాటలను తీవ్రం చేశారు.
ఇదిలా ఉండగా బీజేపీలోకి భారీగా వలసలు పెరిగాయి. దీంతో తమిళనాట కాషాయ జెండా రెప రెప లాడటం ఖాయమని ఆ పార్టీ నమ్ముతోంది. ఈ మేరకు ఎలాగైనా సరే దక్షిణాదిన ముఖ్యంగా తమిళనాడులో బీజేపీ పతాకం ఎగుర వేయాలని కంకణం కట్టుకున్నారు కె. అన్నామలై.
ఇదిలా ఉండగా దివంగత విప్లవ నాయకుడు ఎంజీఆర్ 1977లో మొదటిసారిగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మరోసారి ఎంపీగా గెలుపొందిన వి.కె. చిన్న స్వామి బుధవారం బీజేపీలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ చీఫ్ కె. అన్నామలై. ఈ సందర్బంగా అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న స్వామి రావడంతో మరింత బలం పెరిగిందన్నారు.