బీజేపీని ఓడించక పోతే ప్రమాదం
వీకేసీ ప్రెసిడెంట్ తిరుమావళవన్
హైదరాబాద్ – ఈ దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షుడు తిరుమావళవన్ . ఆయన రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర శ్రీనివాస్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా భారతీయ జనతా పార్టీపై భగ్గుమన్నారు. కేవలం బిలియనర్ల స్వ ప్రయోజనాల కోసమే పని చేస్తున్న కాషాయ దళానికి షాక్ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
లేకపోతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు వీసీకే ప్రెసిడెంట్. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడు కోవాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడిపై ఉందని స్పష్టం చేశారు తిరుమావళవన్.
దక్షిణాది రాష్ట్రాలలో విసికె పోటీ చేస్తోందని చెప్పారు. తెలంగాణలో ఏడుగురు అభ్యర్థులు తమ పార్టీ తరపున బరిలో ఉన్నారని చెప్పారు. తమ పార్టీకి ఎన్నికల సంఘం కుండ గుర్తును కేటాయించిందన్నారు రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర శ్రీనివాస్.
ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశాన్ని ఇప్పటికే కొంత మంది పెట్టుబడిదారులకు వనరులను అప్పగించారని ఇక బీజేపీ మరోసారి గెలిస్తే అందరినీ అమ్మేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.