వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇనుప స్తంభాల లోడుతో వెళుతున్న లారీ ఉన్నట్టుండి అదుపు తప్పింది. రహదారిపై వెళుతున్న రెండు ఆటోలపైకి దూసుకు వెళ్లింది. అనంతరం రోడ్డుపై బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న ఇనుప రాడ్లు ఆటోలపై పడ్డాయి. దీంతో అక్కడికక్కడే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఆటో డ్రైవర్ కాలు విరిగి పోయింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారు భోపాల్ జిల్లాలోని లలితానగర్ కు చెందిన కూలీలుగా గుర్తించారు.
ఇదిలా ఉండగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా ఘటన చోటు చేసుకుంటున్న వెంటనే సమాచారం అందించారు స్థానికులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితులను తరలించేందుకు ప్రయత్నం చేశారు. కాగా లారీ డ్రైవర్ మద్యం మత్తులో నడపడం వల్లనే ఈ దారుణమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్నారు.