మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటన
అమరావతి – సాధ్యమైనంత త్వరగా బుడమేరు పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు. వరదకు గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించారు. గతంలో అత్యవసరంగా పూడ్చిన 3 గండ్లు కలిపి రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టబోతున్నామని ప్రకటించారు. సీజన్ మొదలయ్యేలోగా 3 గండ్ల నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
బుడమేరు డైవర్షన్ కెనాల్ ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా, పెండింగ్ పనులు పూర్తి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు. బుడమేరు వరద, ఎనికేపాడు మీదుగా కొల్లేరు, ఉప్పుటేరు నుండి సముద్రంలో కలిసేలా, డీపీఆర్ తయారీ దశలో ఉందన్నారు. బుడమేరు ఓల్డ్ ఛానెల్ కు సమాంతరంగా, మరొక కొత్త ఛానెల్ ను కూడా 20 వేల క్యూసెక్కుల సామర్ద్యంతో అభివృద్ది చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.
బుడమేరు వరదల నియంత్రణకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద, కేంద్రం సహాకారం తో ముందుకు వెళ్ళేలా ప్రపోజల్స్ తయారు చేశామన్నారు.