5 ఏళ్లలో 20 లక్షల కొలువులు – కొలుసు
నూజివీడు పేరు నిలబెట్టాలని పిలుపు
అమరావతి – ఈ ఐదేళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు
మంత్రి కొలుసు పార్థసారథి. నూజివీడులో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో. 571 మంది యువతీ యువకులు వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇంకో పది సార్లైనా సరే ఇక్కడికి కంపెనీలను తీసుకు వస్తానని అన్నారు. కానీ ఉద్యోగం తెచ్చుకునే బాధ్యత మీదన్నారు. మీరు ఎక్కడికి వెల్లినా నూజివీడు పేరు మారుమ్రోగాలన్నారు.
విద్యా, ఉద్యోగ, ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తూ ప్రపంచ స్థాయి సాంకేతికతను రాష్ట్రానికి తీసుకువచ్చి యువతకు బంగారు భవిష్యత్తు అందించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రతీ ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్తను రూపొందించేలా ప్రత్యేక పారిశ్రామిక పాలసీని రూపొందిస్తున్నామని అన్నారు కొలుసు పార్థసారథి.
అంతేకాక ప్రపంచ స్థాయి సంస్థలు మన రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నామని, వారికి కావలసిన రంగంలో మన యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఆయా పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో స్కిల్ హబ్ లు ఏర్పాటుచేసి, యువతను అన్ని రంగాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. 2047 స్వర్ణాంధ్ర కార్యాచరణ ప్రణాళికలో నైపుణ్యాభివృద్ధి, యువతకు ఉద్యోగ కల్పన అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారని తెలిపారు.