టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్
చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడి
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ప్రకటన చేశారు. టీటీడీ పరిధిలో పని చేసే ప్రతి ఒక్క ఉద్యోగికి నేమ్ బ్యాడ్జ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఉద్యోగులు భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని పలు ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు.
టీటీడీ ఉద్యోగులందరికీ త్వరలోనే నేమ్ బ్యాడ్జ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని స్పష్టం చేశారు బీఆర్ నాయుడు. ఎందుకంటే కొందరు ఉద్యోగులు భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిసిందన్నారు. నిత్యం శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారని అన్నారు.
స్వామి వారి పట్ల నమ్మకంతో వచ్చే భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బీఆర్ నాయుడు. ఈ నేమ్ బ్యాడ్జ్ ఇవ్వడం ద్వారా భక్తుల పట్ల అమర్యాదగా వ్యవహరించిన వారిని గుర్తించే అవకాశం ఉంటుందన్నారు.
భక్తుల పట్ల బాధ్యతాయుతంగా, అంకితభావంతో టీటీడీ ఉద్యోగులు ప్రవర్తించేందుకు ఈ బ్యాడ్జ్ విధానం ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు టీటీడీ చైర్మన్. టీటీడీ అన్ని విభాగాల్లో పనిచేసే ప్రతీ ఉద్యోగికి ఈ నేమ్ బ్యాడ్జ్ త్వరలోనే ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.