ఏపీని టూరిజం హబ్ గా చేస్తాం – సీఎం
సీ ప్లేన్ లో ప్రయాణం అద్భుతం
నంద్యాల జిల్లా – ఏపీని పర్యాటక రంగానికి స్వర్గ ధామంగా తయారు చేస్తామని ప్రకటించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. శనివారం సీ ప్లేన్ ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. విజయవాడ ఘాట్ నుంచి శ్రీవైలం పాతాళగంగ వరకు సీ ప్లేన్ లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ప్రయాణం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో నీటి ఆధారిత విమానయానం ప్రారంభం కావడం సంతోషం కలిగించిందని అన్నారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకు తొలి సీప్లేన్ ప్రయాణాన్ని ఆస్వాదించానని తెలిపారు సీఎం.
ఈ విమానం ఆంధ్రప్రదేశ్‌కు కొత్త మైలురాయిని సూచిస్తుందని చెప్పారు, ఇది మన విమానయాన ల్యాండ్‌స్కేప్‌కు కొత్త కోణాన్ని జోడిస్తుందని పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు. వేగవంతమైన 45 నిమిషాల సేవ పర్యాటకం, ఉపాధిని మెరుగు పరుస్తుందన్నారు. శ్రీశైలంలోని పురాతన శివాలయం, టైగర్ రిజర్వ్ , ఐకానిక్ డ్యామ్ వంటి గమ్య స్థానాలకు ప్రాప్యతను మెరుగు పరుస్తుందని అన్నారు సీఎం.
సీ ప్లేన్‌లు కేవలం పర్యాటకం కోసం మాత్రమే ఉపయోగించ బడతాయని చెప్పారు. అత్యవసర సేవలు , రవాణా కోసం కూడా వీటిని ఉపయోగిస్తారని తెలిపారు. భారతదేశ ఉడాన్ స్కీమ్ 3.0 , 3.1 సీప్లేన్ టూరిజాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.
ప్రకాశం బ్యారేజీని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలకమైన వాటర్ ఏరోడ్రోమ్‌గా జాబితా చేసిందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ అంతటా మరింత సుందరమైన , మారుమూల ప్రాంతాలను కలుపుతూ వాటర్ ఏరోడ్రోమ్‌లను విస్తరించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయని తెలిపారు సీఎం.