పశ్చిమ బెంగాల్ సర్కార్ కు బిగ్ షాక్
కోల్ కతా – పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. కోల్ కతాలో ఆర్ఎస్ఎస్ బహిరంగ సభకు అనుమతి ఇస్తూ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 16న ఆర్ఎస్ఎస్ సభ నిర్వహించనుంది. ఇందు కోసం ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీనిని సవాల్ చేస్తూ ఆర్ఎస్ఎస్ కోర్టును ఆశ్రయించింది. ఈ సభకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరు కానున్నారు. సీఎంపై సీరియస్ కామెంట్స్ చేశారు పరివార్ సభ్యులు.
ఇదిలా ఉండగా బెంగాల్ లో బీజేపీ సీఎం మమతా బెనర్జీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమన్న చందంగా వార్ కొనసాగుతోంది. తమ పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని బీజేపీ బహిరంగంగానే హెచ్చరించింది.
మరో వైపు సీఎం వర్సెస్ రాష్ట్ర గవర్నర్ బోస్ మధ్య మాటల యుద్దం కొనసాగింది. చివరకు రాజ్ భవన్ లో ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో దేశంలోనే తొలిసారిగా గవర్నర్ కోర్టుకు ఎక్కారు.
ఏకంగా సీఎం మమతా బెనర్జీపై పరువు నష్టం దావా వేశారు. ఇది కలకలం రేపింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించారు సీఎం. దీంతో కేంద్రం వర్సెస్ సీఎంగా మారి పోయింది.