NEWSTELANGANA

ప్లీజ్ కేసీఆర్ క‌నిపిస్తే చెప్పండి

Share it with your family & friends

హైద‌రాబాద్ లో పోస్ట‌ర్లు క‌ల‌క‌లం

హైద‌రాబాద్ – తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వైర‌ల్ గా మారారు. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నారు. ఓ వైపు రాష్ట్రంలో పెద్ద ఎత్తున వ‌ర్షాలు, వ‌ర‌ద బీభత్సం సృష్టించింది. రాష్ట్ర మంత‌టా ప‌రిస్థితి దారుణంగా ఉంది.

బాధితులు అంత‌కంత‌కూ పెరిగి పోతున్నారు. 5 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు పైగా పంట‌ల‌కు న‌ష్టం వాటిల్లినట్లు ప్రాథ‌మికంగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అంచ‌నా వేసింది. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం స‌హాయ‌క చ‌ర్య‌ల‌లో పాల్గొంటోంది.

ఈ త‌రుణంలో బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ ఎక్క‌డా క‌నిపించ‌క పోవ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక బాధ్య‌త క‌లిగిన ప్ర‌తిప‌క్ష నేత‌గా ఎందుకు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌ను సంద‌ర్శించ‌డం లేదంటూ నిల‌దీశారు. ఇందుకేనా మీకు ప్ర‌తిప‌క్ష హోదా క‌ట్ట‌బెట్టింది అంటూ మండిప‌డ్డారు.

ఇదిలా ఉండ‌గా హైద‌రాబాద్ లో ప‌లు చోట్ల కేసీఆర్ క‌నిపించ‌డం లేదంటూ పోస్ట‌ర్లు వెలిశాయి. ప్లీజ్ క‌నిపిస్తే చెప్పాల‌ని, ఆచూకి తెలిపిన వారికి మంచి బ‌హుమ‌తి కూడా ఉంటుంద‌ని పేర్కొన్నారు. మొత్తంగా కేసీఆర్ చ‌ర్చ‌నీయాంశంగా మార‌డం విశేషం. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు భ‌గ్గుమంటున్నాయి.