విప్ ఆది శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్
కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే దాడుల పరంపర
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భారత రాష్ట్ర సమితి పార్టీపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మాజీ మంత్రి టీఆర్ ను గనుక ఏసీబీ అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలం చేయాలని బీఆర్ఎస్ కుట్ర పన్నిందంటూ మండిపడ్డారు.
శుక్రవారం ఆయన అసెంబ్లీ పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని కేటీఆర్ అనుచరుడు శ్రీధర్ ఆదేశాలు ఇచ్చినట్లు కచ్చితమైన సమాచారం ఉందని చెప్పారు ఆది శ్రీనివాస్.
రాష్ట్ర మంతటా ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు తగలబట్టి అల్లర్లు, దాడులు, ధర్నాలు చేసేందుకు సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా ఒక్కో నియోజకవర్గానికి ఇందుకు సంబంధించి రూ. 2 కోట్ల చొప్పున ఇప్పటికే పంపించారని అన్నారు ఆది శ్రీనివాస్.
బీఆర్ఎస్ కుట్రలను, దాడులను తిప్పి కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.