ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీరియస్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావుపై భగ్గుమన్నారు. అబద్దాలు చెప్పడంలో నెంబర్ వన్ అంటూ పేర్కొన్నారు. మసిపూసి మారేడు కాయ చేయడంలో , ప్రభుత్వాన్ని బద్నాం చేయడం పనిగా పెట్టుకున్నారంటూ ధ్వజమెత్తారు. కల్వకుంట్ల కుటుంబాన్ని జనం నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కేటీఆర్, కవిత, కేసీఆర్ ఎన్ని ఆరోపణలు చేసినా సర్కార్ ను ఏమీ చేయలేరని హెచ్చరించారు.
ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. నిరాధార ఆరోపణలు, విమర్శలు చేయడం అలవాటుగా మారిందన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. మాట్లాడే ముందు వెనుకా ముందు ఆలోచించుకుని మాట్లాడాలని హితవు పలికారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన నకీర్తి కనకవ్వ కు రైతు భరోసా విషయంలో 31 గుంటలు ఉంటే కేవలం రూ.1650 వేశారని హరీష్ రావు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దుష్ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారి పోయారంటూ మండిపడ్డారు ఆది శ్రీనివాస్.