ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్
హైదరాబాద్ – మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై నిప్పులు చెరిగారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అన్నీ మూసుకుని కూర్చోండి అంటాడా అంటూ మండిపడ్డారు. నోరు జారిన జగదీశ్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని అన్నారు. సభలో జరిగిన సంఘటన చాలా బాధాకరమని అన్నారు. గవర్నర్ అంటే గౌరవం లేదన్నారు. నువ్వు ఎవరివంటూ ఏక వచనంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఉద్దేశించి మాట్లాడటం అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. అందుకే ప్రజలు అధికారం నుంచి దూరం చేశారని ఎద్దేవా చేశారు.
సభా సంప్రదయాలకు భంగం కలిగించేలా వ్యవహరించడం దారుణమన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. గురువారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్బంగా మాటల యుద్దం కొనసాగింది అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య. గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ఇంకా తాము అధికారంలో ఉన్నామని భావిస్తున్నారని , అలాగే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు విప్ ఆది శ్రీనివాస్.