ఎవరీ శాంతను నాయుడు..ఏమిటా కథ..?
రతన్ టాటాకు నమ్మకమైన స్నేహితుడు
హైదరాబాద్ – భారత దేశ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కోట్లాది మందిని ప్రభావితం చేశారు. కానీ ఆయనతో ఎక్కువగా స్నేహ పూర్వకంగా ఉన్నది మాత్రం ఒకే ఒక్కడు. అతడే శాంతను నాయుడు. స్వస్థలం ముంబై. తను స్టార్టప్ ప్రారంభించాడు. కుక్కలను ప్రేమించడం, గాయపడిన వాటిని రక్షించడం. అవసరమైన సేవలు అందించడం. ఇదే రతన్ టాటాను ఆకట్టుకుంది. ఆయనకు శునకాలంటే వల్లమాలిన అభిమానం. ఇద్దరూ కొన్నేళ్ల పాటు కలిసే ఉన్నారు. ఒకరంటే మరొకరికి అభిమానం..గౌరవం కూడా.
చివరి చూపులో కన్నీటి పర్యంతం అయ్యాడు శాంతను నాయుడు. ఈ సందర్బంగా తను పంచుకున్న మాటలు ఎల్లప్పటికీ గుర్తుండి పోతాయి. తను గురువుగా భావించే రతన్ టాటా లేని లోటును పూడ్చ లేదని వాపోయాడు. అంతే కాదు ఈ శూన్యతను భరించడం చాలా కష్టమని ఆవేదన చెందాడు శాంతను నాయుడు. ఈ సందర్బంగా ప్రముఖ సామాజిక మాధ్యమం లింక్డ్ ఇన్ లో ..
“ఈ స్నేహం ఇప్పుడు నాకు మిగిల్చిన రంధ్రం, నేను నా జీవితాంతం పూరించడానికి ప్రయత్నిస్తాను. దుఃఖం ప్రేమకు చెల్లించాల్సిన ధర. వీడ్కోలు, నా ప్రియమైన లైట్‌హౌస్, ” బాధను వ్యక్త పరిచాడు.
ఇంజనీరింగ్ ఇంటర్న్ నుండి టాటాతో విశ్వసనీయ ప్రయాణం సాగింది . టాటా ట్రస్టులో జనరల్ మేనేజర్ గా చివరి వరకు పని చేశాడు శాంతను నాయుడు. రతన్ టాటా నాయుడు మధ్య స్నేహం కుదరడానికి బలమైన కారణం ఉంది.
2014లో పూణేలోని టాటా ఎల్క్సీలో ఆటోమొబైల్ డిజైన్ ఇంజనీర్‌గా పని చేస్తున్న సమయంలో రోడ్డు మధ్యలో చనిపోయిన కుక్కను చూశానని చెప్పాడు. నెలల తరబడి ఈ దృశ్యాన్ని చూసి కలవరపడిన నాయుడు రాత్రి పూట కార్లు ఢీకొనకుండా వీధి కుక్కలను రక్షించడానికి రిఫ్లెక్టివ్ కాలర్‌లను అభివృద్ధి చేశాడు.
దీంతో తాను తయారు చేసిన డాగ్ కాలర్ కు డిమాండ్ పెరిగింది. నిధుల కొరత కారణంగా ఇబ్బంది పడ్డాడు శాంతను నాయుడు. ఈ సమయంలో తండ్రి టాటాకు లేఖ రాయమని కొడుకకు సూచించాడు. మొదట సంశయించినా ఆ తర్వాత తాను రాసిన దానికి రెండు నెలల తర్వాత టాటా నుంచి సమాధానం వచ్చింది. వ్యక్తిగతంగా కలవాలని సూచించాడు.
శాంతను నాయుడు చేస్తున్న నిస్వార్థ సేవను చూసి, తాను తయారు చేసిన డాగ్ కాలర్ ను ప్రత్యేకంగా అభినందించాడు రతన్ టాటా. స్వచ్చంధ సంస్థ మోటోపాస్ కు మద్దతు ఇచ్చేలా చేసింది. డాగ్ కాలర్లు, పులుల కోసం సెన్సార్ ఆధారిత యాంటీ పోచింగ్ వంటి పరికరాలను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించాడు శాంతను నాయుడు. మహారాష్ట్రలోనే కాదు భారత దేశ వ్యాప్తంగా జంతు సంబంధిత ప్రమాదాలను తగ్గించేలా చేసింది.
శాంతను నాయుడు అమెరికా లోని కార్నెల్ జాన్సన్ గ్రాడ్యూయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో ఎంబీఏ చేశాడు. పలు ప్రశంసలు, అవార్డులు పొందాడు. అక్కడ ఓ పారిశ్రామికవేత్తతో పరిచయం టాటా కార్యాలయంలో పని చేసేందుకు దోహద పడేలా చేసింది.
రతన్ టాటా వద్ద అసిస్టెంట్ గా చేరాడు. కొత్తగా స్టార్టప్ లకు సాయం చేసేందుకు సంబంధించి సరైనవా కాదా అనేది నిర్ణయించే పనిని శాంతను నాయుడుకు అప్పగించారు రతన్ టాటా. ఇప్పటి వరకు 30కి పైగా అంకురాలకు టాటా సాయం చేశాడు. దీనికి ప్రధాన కారకుడు నాయుడు. 10 ఏళ్లకు పైగా రతన్ టాటాకు నమ్మకమైన వ్యక్తిగా మారి పోయాడు శాంతను నాయుడు.
ఇదే సమయంలో వృద్దుల కోసం 2021లో శాంతను నాయుడు గుడ్ ఫెలోస్ అనే పేరుతో వెంచర్ ను ఏర్పాటు చేశాడు. దీనికి రతన్ టాటా పూర్తి మద్దతు ఇచ్చాడు. ఈ సందర్భంగా రతన్ టాటా ఈ లోకాన్ని వీడడంతో శాంతను నాయుడు మరోసారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు. సేవ చేయాలన్న సంకల్పం మనిషిని ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేస్తుంది కదూ.