ప్రశ్నించిన కోర్టు న్యాయమూర్తి
అమరావతి – గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్లపై ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. వంశీని ప్రత్యేక సెల్ లో ఎందుకు ఉంచారంటూ ప్రశ్నించారు న్యాయమూర్తి. జైలులో బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఉండడంతో తనను ప్రత్యేక గదిలో ఉంచామని తెలిపారు సూపరింటెండెంట్ .
కాగా టేలర్ బోన్ సమస్యతో బాధ పడుతున్న వంశీకి ఎత్తైన టేబుల్ ఏర్పాటు చేయాలని లాయర్ కోరారు. దీనిపై జైలు సిబ్బంది, డాక్టర్ తో మాట్లాడతానని న్యాయమూర్తి తెలిపారు. వంశీ హెల్త్ కండీషన్ రిపోర్టులు అందజేశారు. ఎక్స్ పర్ట్ అభిప్రాయం తీసుకుంటామని కోర్టుకు తెలిపారు జైలు డాక్టర్.
ఇదిలా ఉండగా టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో దళితుడిపై దౌర్జన్యం చేశాడని వంశీతో పాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. కోర్టుకు తరలించగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు న్యాయూమర్తి.
తను కేసులు తారుమారు చేసే అవకాశం ఉందని, కావున విచారణ చేపట్టేందుకు తమకు కస్టడీకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. ఈ కేసుకు సంబంధంచి ఇవాళ విచారణ చేపట్టింది కోర్టు.