స్పష్టం చేసిన మహిపాల్ రెడ్డి
హైదరాబాద్ – పటాన్ చెరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మహిపాల్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తన జీవితంలో ఎవరినీ కించ పర్చిన దాఖలాలు లేవన్నారు. పార్టీకి చెందిన కొందరు నేతలు తనపై దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా పటాన్ చెరు ఘటనపై సీఎం విచారణకు ఆదేశించారు. అందరి అభిప్రాయాలు తీసుకుని నివేదిక ఇస్తామని తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వినోద్ రెడ్డి.
ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా సీన్ మారుతోంది. ప్రజా పాలన పేరుతో జనాన్ని మోసం చేయడం, ఇచ్చిన హామీలను అమలు చేయలేక పోవడంతో రేవంత్ రెడ్డి సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. స్వంత పార్టీ తాజాగా ఫాం హౌస్ పాలన , ప్రజా పాలన లో ఏది బెటర్ అంటూ సోషల్ మీడియా వేదికగా సర్వే నిర్వహించింది. పెద్ద ఎత్తున 70 శాతానికి పైగా కేసీఆర్ పాలన కావాలని కోరుకున్నారు. కేవలం 29 శాతం మంది మాత్రం ప్రజా పాలన కావాలని కోరుకోవడం విస్తు పోయేలా చేసింది.
దీనిపై సీరియస్ గా స్పందించారు టీపీసీసీ చీఫ్ బొమ్మగాని మహేష్ కుమార్ గౌడ్. ఆయన తమ పార్టీకి చెందిన సోషల్ మీడియా టీం కొంచెం వీక్ అంటూ ఒప్పుకున్నారు. సరిదిద్దేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త నేతల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడం పార్టీకి తలనొప్పిగా మారింది.