NEWSANDHRA PRADESH

క‌డ‌ప స‌ర్కార్ బ‌డికి స్వంత నిధులిస్తా

Share it with your family & friends

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల
అమ‌రావ‌తి – ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం వైఎస్సార్ క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించారు. మెగా టీచ‌ర్స్ పేరెంట్స్ క‌మిటీ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా పిల్ల‌ల‌తో ముచ్చ‌టించారు. వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. చ‌దువుపై ఫోక‌స్ పెట్టాల‌న్నారు .

కడప ప్రభుత్వ స్కూల్‌ కిచెన్‌ ఆధునీకరణకు తాను సొంత నిధులు ఇస్తానని ప్ర‌క‌టించారు.. విద్యార్థినుల ఆటలకు అవసరమైన నిధులన్నీ తానే స‌మ‌కూరుస్తాన‌ని చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. త‌న‌కు నిజ‌మైన హీరో ఎవ‌రంటే ముందుగా చెప్పేది ఒకే ఒక్క‌రు టీచ‌రేన‌ని వెల్ల‌డించారు.

స్కూల్స్ ను ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు వాడితే చూస్తూ ఊరుకోమ‌న్నారు. క‌బ్జా చేసినా కేసులు పెడ‌తామ‌ని హెచ్చ‌రించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. రాయలసీమ తెగింపుల నేల.. ఆడపిల్లలను ఏడిపిస్తే సహించనని అన్నారు . రాయలసీమ అంటే వెనుకబడిన ప్రాంతం కాదు.. సాహిత్యానికి నిలయం అని కొనియాడారు.

విద్యార్థులు విద్య‌పై ఫోక‌స్ పెట్టాల‌ని సూచించారు. రోజు రోజుకు టెక్నాల‌జీ మారుతోంద‌ని, దానిని గుర్తించి ప్రావీణ్య‌త సాధించేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌.