SPORTS

విల్ జాక్స్ అద‌ర‌హో

Share it with your family & friends

ధ‌నా ధ‌న్ ఇన్నింగ్స్

గుజరాత్ – అహ్మ‌దాబాద్ వేదికగా జ‌రిగిన ఐపీఎల్ 2024 లీగ్ మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టును త‌న స్వంత మైదానంలో చుక్క‌లు చూపించింది. నిర్దేశించిన 201ప‌రుగుల ల‌క్ష్యాన్ని 15.5 ఓవ‌ర్ల‌లోనే పూర్తి చేసింది.

ప్ర‌ధానంగా ఆర్సీబీ కేవ‌లం ఒకే ఒక్క వికెట్ ను మాత్ర‌మే కోల్పోయింది. వికెట్ కోల్పోకుండా విల్ జాక్స్ , విరాట్ కోహ్లీ జాగ్ర‌త్త ప‌డ్డారు. అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో క‌ళ్లు చెదిరే షాట్స్ కొడుతూ దుమ్ము రేపారు. ఒక ర‌కంగా చెప్పాలంటే గుజ‌రాత్ బౌల‌ర్ల‌ను చిత‌క్కొట్టారు.

ప్ర‌ధానంగా ఓపెన‌ర్ గా వ‌చ్చిన విల్ జాక్స్ షాన్ దార్ సెంచ‌రీతో దంచి కొట్టాడు. త‌న‌కు ఎదురే లేద‌ని చాటాడు. డుప్లెసిస్ 24 ర‌న్స్ తో అవుట్ అయ్యాక వికెట్ కోల్పోకుండానే టార్గెట్ ను పూర్తి చేశారు. 2వ వికెట్ కు విల్ జాక్స్ , విరాట్ కోహ్లీ క‌లిసి ఏకంగా 133 ర‌న్స్ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఐపీఎల్ 17వ సీజన్ లో ఇది కూడా ఓ రికార్డ్.

వైస్ కెప్టెన్ ర‌షీద్ ఖాన్ వేసిన 16వ ఓవ‌ర్ లో జాక్స్ ఆకాశ‌మే హ‌ద్దుగా రెచ్చి పోయాడు. నాలుగు సిక్స‌ర్లు ఒక ఫోర్ కొట్టాడు. 28 ప‌రుగులు పిండుకున్నాడు . అంత‌కు ముందు గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టులో షారుక్ ఖాన్ క‌దం తొక్కాడు. 58 ర‌న్స్ చేశాడు. సాయి సుద‌ర్శ‌న్ 84 ర‌న్స్ తో రెచ్చి పోయాడు.