రూ. 15 లక్షలతో చివరి స్థానంలో మమతా బెనర్జీ
అమరావతి – దేశంలో టీడీపీ చీఫ్, సీఎం నారా చంద్రబాబు నాయుడు రూ.931 కోట్ల ఆస్తులతో అత్యంత సంపన్నమైన సీఎంగా నిలిచాడు. రూ.332 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రెండో స్థానంలో ఉండగా చివరి స్థానంలో కేవలం రూ. 15 లక్షల సంపదతో టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ముఖ్యమంత్రుల అఫిడవిట్లు, నామినేషన్ పత్రాల విశ్లేషణ ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక రూపొందించింది. దీదీ తన అఫిడవిట్ లో రూ. 15,38,029 విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొంది.
జమ్మూ, కాశ్మీర్ కు చెందిన ఒమర్ అబ్దుల్లా మొత్తం ఆస్తుల విలువ రూ. 55 లక్షల కంటే ఎక్కువ. నేషనల్ కాన్ఫరెన్స్ నేత 2024లో తన స్వీయ ఆదాయాన్ని రూ. 14, 52, 010 గా ప్రకటించారు. 1.18 కోట్ల ఆస్తులతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీఎంల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. చరాస్తుల విలువ రూ. 31,80,766 , స్థిరాస్తుల విలువ రూ. 86,95,000 గా ఉన్నాయి. స్వీయ ఆదాయం రూ. 2,87,860గా పేర్కొన్నారు.
రూ. ఒక కోటి కంటే తక్కువ సీఎంలు 10 మందిగా తేలారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య 2వ స్థానంలో ఉన్నారు.