NEWSNATIONAL

వ‌క్ఫ్ బిల్లు కోసం సంయుక్త క‌మిటీ ఏర్పాటు

Share it with your family & friends

ప్ర‌క‌టించిన మోడీ బీజేపీ సంకీర్ణ స‌ర్కార్

న్యూఢిల్లీ – మోడీ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్ర‌భుత్వం దూకుడు పెంచింది. ప్ర‌ధానంగా ముస్లింల‌కు సంబంధించి వ‌క్ఫ్ బోర్డులో స‌వ‌ర‌ణలు చేప‌ట్టేందుకు బిల్లును ప్ర‌వేశ పెట్టింది. ఇందులో భాగంగా దీనిపై సాధ్యాసాధ్యాలు, విధి విధానాలు ఖ‌రారు చేసేందుకు ప్ర‌తిప‌క్షాలు, అధికార ప‌క్షానికి చెందిన స‌భ్యుల‌తో క‌లిపి జాయింట్ క‌మిటీ (సంయుక్త క‌మిటీ)ని ఏర్పాటు చేసింది.

ఇందులో భాగంగా లోక్ స‌భ నుంచి 31 మంది ఎంపీలు, రాజ్య‌స‌భ నుంచి 10 మంది స‌భ్యుల‌ను ఖ‌రారు చేసింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి జ‌గ‌దాంబిక పాల్ , నిషికాంత్ దూబే, తేజ‌స్వి సూర్య‌, అప‌రాజిత సారంగి, సంజ‌య్ జైస్వాల్ , దిలీప్ సైకియా , అభికిత్ గంగోపాధ్యాయ‌, డీకే అరుణ ఉన్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి గౌర‌వ్ గొగోయ్, ఇమ్రాన్ మ‌సూద్ , మ‌హ్మ‌ద్ జావెద్ , స‌మాజ్ వాది పార్టీ నుంచి మౌలానా మొహిబుల్లా, టీఎంసీ నుంచి క‌ళ్యాణ్ బెన‌ర్జీ, డీఎంకే నుంచి ఎ. రాజా, టీడీపీ నుంచి లావు శ్రీ‌కృష్ణ దేవ రాయులు, జేడీయూ నుంచి దిలేశ్వ‌ర్ క‌మైత్ , శివ‌సేన యూబీటీ నుంచి అర‌వింద్ సావంత్ ఉన్నారు.

ఎన్సీపీ శ‌ర‌ద్ పవార్ పార్టీ నుంచి సురేష్ మాత్రే, శివ‌సేన నుంచి న‌రేష్ మాస్కే, లోక్ జ‌న శ‌క్తి రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీ నుంచి అరుణ్ భార‌తి, ఎంఐంఎ నుంచి అస‌దుద్దీన్ ఓవైసీ ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్ర‌భుత్వం.