అరెస్ట్ చేయించినోళ్లు నాశనమై పోతారు
సినీ రచయిత చిన్నకృష్ణ కామెంట్స్
హైదరాబాద్ – ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయించిన నాయకులు, ప్రభుత్వాలు నాశనమై పోతాయని శపించారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు తాను అన్నం తినలేదన్నారు. అల్లు అర్జున్ అంటే తనకు ప్రాణమని అన్నారు. స్వచ్ఛమైన మనసు కలిగిన వ్యక్తి అంటూ కితాబు ఇచ్చారు.
నిన్ననే విడుదల కావాల్సి ఉండగా చంచల్ గూడ జైలు అధికారుల ఆలస్యంతో అల్లు అర్జున్ రాలేక పోయారు. శనివారం ఉదయం ఆయనను విడుదల చేశారు. తను కూడా జైలులోనే ఉన్నారు. ఆయనకు నెంబర్ కూడా కేటాయించారు.
తొలుత నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు బన్నీని. అక్కడ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించింది. దీనిని సవాల్ చేస్తూ ఎంపీ, లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టులో వాదించారు. చివరకు అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చేలా చేశారు. ఇందులో కీలక పాత్ర పోషించారు.
అయితే తన కొడుకు శుక్రవారం రోజే బయటకు వస్తాడని తండ్రి అల్లు అరవింద్ తో సహా కుటుంబం భావించింది. కానీ పోలీసుల తీరు కారణంగా రాలేక పోయారు. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అరవింద్. ఇదిలా ఉండగా తాజాగా మీడియాతో మాట్లాడిన చిన్న కృష్ణ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.