ఎక్స్ కొత్త లోగో రిలీజ్
ప్రకటించిన ఎలాన్ మోస్క్
అమెరికా – ప్రపంచ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను నిత్యం ఏదో ఒక కొత్తదనంతో ముందుకు వస్తుంటాడు. ఎవరూ ఊహించని రీతిలో భారీ ధరకు ట్విట్టర్ ను కొనుగోలు చేశాడు. అంతా తనను పిచ్చివాడని, ఎందుకు అంత భారీగా ఇన్వెస్ట్ చేశాడంటూ ఎద్దేవా చేశారు. కానీ మనోడు తక్కువ కాదు. ఒక దానిపై ఫోకస్ పెట్టాడంటే అది తన చేతిలోకి రావాల్సిందే .
ట్విట్టర్ రూపు రేఖలు మార్చేశాడు. ప్రధానంగా కీలకమైన మార్పులు తీసుకు వచ్చాడు. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను యాడ్ చేయించాడు. అంతే కాదు తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఓ వైపు టెస్లా, మరో వైపు స్టార్ లింక్, ఇంకో వైపు రోదసీ కనెక్టివిటీ, మొబైల్ తయారీ, ఇలా ప్రతిదానిలో నూతనత్వం ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. దీంతో ప్రపంచ మార్కెట్ లో సోషల్ మీడియా పరంగా ఎక్స్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ఫుల్ స్వేచ్ఛ ఇచ్చాడు. ఎవరైనా సరే ఎక్స్ వేదికగా ఆలోచనలు, అభిప్రాయలను పంచుకోవచ్చని ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రింట్ మీడియా అక్కర్లేదంటూ సంచలన ప్రకటన చేశాడు. తాజాగా అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఎక్స్ కీలకమైన పాత్ర పోషించింది. ట్రంప్ గెలవడంలో ముఖ్య భూమిక పోషించింది. ఇప్పుడు ఎలాన్ మస్క్ అమెరికా పాలనలో భాగస్వామి కానున్నాడు.