NEWSINTERNATIONAL

బారీ స్టాంట‌న్ ఎక్స్ ఖాతా నిలిపివేత

Share it with your family & friends

జాత్యహంకార పోస్టుల‌పై ఇండియ‌న్స్ ఫైర్

ఢిల్లీ – ట్విట్ట‌ర్ ఎక్స్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. బారీ స్టాంట‌న్ ఖాతాను తాత్కాలికంగా నిలిపి వేసింది. జాత్యహంకార పోస్టులు పెట్ట‌డం, భార‌తీయుల‌ను కించ ప‌రిచేలా కామెంట్స్ ఉండ‌డంతో భార‌తీయులు పెద్ద ఎత్తున ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ట్విట్ట‌ర్ ఎక్స్ పై దుమ్మెత్తి పోశారు. దీంతో ట్విట్ట‌ర్ యాజ‌మాన్యం దిగి వ‌చ్చింది. వెంట‌నే స్పందించింది. ఈ మేర‌కు బారీ స్టాంట‌న్ ఖాతాను నిలిపి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు కీలక ప్ర‌క‌ట‌న చేసింది.

భారతీయులు , భారతీయ వలసదారులను విమర్శిస్తూ జాత్యహంకార పోస్ట్‌లు పెడుతూ , షేర్ చేస్తూ వ‌చ్చారు. దీంతో బారీ స్టాంట‌న్ ఒక్క‌సారిగా ట్విట్ట‌ర్ ఎక్స్ లో వైర‌ల్ గా మారారు. స్టాంటన్ పోస్ట్‌లను వందలాది మంది ప్ర‌స్తావించారు. వెంట‌నే అత‌డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

త‌న ఖాతాపై చ‌ర్య‌లు తీసుకోక పోవ‌డాన్ని ఎక్స్ య‌జ‌మాని ఎలోన్ మ‌స్క్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనిపై వెంట‌నే స్పందించారు మ‌స్క్. బారీ స్టాంట‌న్ ఖాతాను నిలిపి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో భార‌తీయులు సంతోషం వ్య‌క్తం చేశారు.