NEWSNATIONAL

కాశ్మీర్ సుర‌క్షిత ప్రాంతం – మీర్

Share it with your family & friends

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కామెంట్

న్యూఢిల్లీ – సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ యానా మీర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. యునైటెడ్ కింగ్ డ‌మ్ పార్ల‌మెంట్ భ‌వ‌నంలో హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా యానా మీర్ కు అరుదైన అవ‌కాశం ల‌భించింది. త‌న దేశం గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

నేను మ‌లాలా కాదు. నేను స్వేచ్చ‌గా ఉన్నాను. నా దేశం భార‌త దేశం. ఈ దేశంలో భాగ‌మైన కాశ్మీర్ అత్యంత సుర‌క్షిత ప్రాంతంగా భావిస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు యానా మీర్. నేను నా స్వ‌దేశం నుండి పారి పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేసింది.

తీవ్ర‌వాదుల‌ను నిర్మూలించేందుకు భార‌త దేశానికి చెందిన సైన్యం చేస్తున్న కృషిని ఈ సంద‌ర్బంగా యానా మీర్ ప్ర‌శంస‌లు కురిపించారు. యానా మీర్ చేసిన ప్ర‌సంగం ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. ఈ సంద‌ర్బంగా యూకే పార్ల‌మెంట్ లో ఆమెకు అరుదైన పుర‌స్కారం ల‌భించింది. ఆమెకు డైవ‌ర్సిటీ అంబాసిడ‌ర్ అవార్డు ల‌భించింది.