Friday, April 18, 2025
HomeNEWSANDHRA PRADESHమహాకవి నన్నయ్య - యార్ల‌గ‌డ్డ

మహాకవి నన్నయ్య – యార్ల‌గ‌డ్డ

ల‌క్ష్మీ ప్రాసాద్ కీల‌క వ్యాఖ్య‌లు

అమ‌రావ‌తి – ప‌ద్మ భూష‌ణ్ ఆచార్య యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీ ప్ర‌సాద్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు . ఖాజీపాలెం కెవిఆర్, కెవిఆర్, ఎంకెఆర్ కళాశాలో ఘనంగా నన్నయ్య విగ్రహావిష్కరణ జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీ ప్ర‌సాద్ ప్ర‌సంగించారు.

తెలుగు భాషకు సారస్వత స్దాయి కల్పించిన ఘనత మహాకవి నన్నయ్యకే దక్కుతుందని అన్నారు. వెయ్యి సంవత్సరాల క్రితమే తెలుగు భాషకు నన్నయ్య సాహితీ గౌరవాన్ని కల్పించారని చెప్పారు. బాపట్ల జిల్లా ఖాజీపాలెంలోని కెవిఆర్, కెవిఆర్, ఎంకెఆర్, కళాశాల 43వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అదికవి నన్నయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి యార్లగడ్డ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

తెలుగు పద్య సౌందర్యాన్ని తొలుత ప్రపంచానికి చాటింది నన్నయ్య మాత్రమేనన్నారు. సంస్కృతీ పదాలతో పాటు దేశీయ పదాలను సైతం పద్యంలో అంతర్భాగం చేసే అక్షరాన్ని ననయ్య రమ్యంగా మార్చారన్నారు.

రాజమండ్రి అదికవి నన్నయ్య విశ్వ విద్యాలయం తదుపరి ఆంధ్రప్రదేశ్ లో నన్నయ్య విగ్రహావిష్కరణకు బాపట్ల జిల్లా వేదిక కావటం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు డాక్టర్ ఎం నరసరాజు, సెక్రటరీ, కరస్పాండెంట్ ఎం. శ్రీనివాస కుమార్, ప్రిన్సిపల్ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments