ఆసిస్ పై విజయం జైశ్వాల్ సంతోషం
ఆనందంగా ఉందన్న యువ క్రికెటర్
ఆస్ట్రేలియా – ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా జరిగిన కీలకమైన తొలి టెస్ట్ మ్యాచ్ లో తాను సెంచరీ చేయడం మరిచి పోలేని జ్ఞాపకంగా మిగిలి పోతుందన్నాడు యువ క్రికెటర్ యశస్వి జైశ్వాల్. రెండో ఇన్నింగ్స్ లో అద్భుతమైన భాగస్వామ్యాన్ని విరాట్ కోహ్లీతో కలిసి నెలకొల్పడం కూడా మరింత సంతోషాన్ని మిగిలించిందని పేర్కొన్నాడు.
ఐదు టెస్టు సీరీస్ లో భాగంగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు స్టాండింగ్ స్కిప్పర్ బుమ్రా సారథ్యంలో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 235 పరుగుల భారీ తేడాతో విక్టరీ సాధించింది. ఆతిథ్య జట్టుకు ఇది కోలుకోలేని షాక్.
ప్రధానంగా భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కెప్టెన్ బుమ్రా తొలి ఇన్నింగ్స్ లో 4 కీలక వికెట్లు తీసి నడ్డి విరిస్తే రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆసిస్ పతనాన్ని శాసించాడు. ఇది పక్కన పెడితే తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే పరిమితమైన భారత్ రెండో ఇన్నింగ్స్ లో జైశ్వాల్ , కోహ్లీ పుణ్యమా అని భారీ స్కోర్ సాధించింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక చతికిల పడింది ఆసిస్.