3 ఫోర్లు 5 సిక్సర్లతో 67 పరుగులు
ములాన్ పూర్ – రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 205 రన్స్ చేసింది. ఈ మెగా టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్ లలో తీవ్ర నిరాశ పరిచాడు యశస్వి జైశ్వాల్. కెప్టెన్ సంజూ శాంసన్ తో కలిసి జైశ్వాల్ తొలి వికెట్ కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. యశస్వి 3 ఫోర్లు 5 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 67 రన్స్ చేశాడు. సంజూ శాంసన్ 38 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఫెర్గూసన్ బౌలింగ్ లో సిక్స్ కొట్టబోయి అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన రియాన్ పరాగ్ సూపర్ షో చేశాడు. 47 రన్స్ చేశాడు.
కాగా గత మూడు మ్యాచ్ లలో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన యశస్వి జైశ్వాల్ సూపర్ షో చేశాడు. అద్భుతంగా ఆడాడు. పంజాబ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. శాంసన్ , జైశ్వాల్ కలిసి తొలి వికెట్ కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పంజాబ్ బౌలర్లలో ఫెర్గుసన్ 37 రన్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు. 9 వికెట్లు కోల్పోయింది. అనంతరం మైదానంలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఆదిలోనే జోఫ్రా ఆర్చర్ ఝలక్ ఇచ్చాడు. నేహాల్ వధేరా, గ్లెన్ మాక్స్ వెల్ మాత్రమే ఆడారు. మిగతా వారు నిరాశ పరిచారు. వధేరా 41 బంతుల్లో 62 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 3 సిక్స్ లు ఉన్నాయి. మాక్స్ వెల్ 30 రన్స్ చేశాడు.