సంజూ..సంగక్కరకు థ్యాంక్స్
క్రికెటర్ యశస్వి జైశ్వాల్
జైపూర్ – యావత్ క్రికెట్ లోకం రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ చేసిన పనికి ఫిదా అయ్యింది. దీనికి కారణం తనతో పాటు క్రీజులో ఉన్న యశస్వి జైశ్వాల్ కు మద్దతుగా నిలిచాడు. అంతే కాదు తను సెంచరీ చేసేందుకు కారణం అయ్యాడు. ఎవరైనా శాంసన్ ప్లేస్ లో ఉంటే ముందుగానే టార్గెట్ పూర్తి చేసి ఉండేవారు.
ఇప్పటికే ఐపీఎల్ 2024లో జరిగిన 8 మ్యాచ్ లలో 7 మ్యాచ్ లలో జైశ్వాల్ ఆశించిన మేర రాణించ లేక పోయాడు. గత ఐపీఎల్ సీజన్ లో దుమ్ము రేపాడు. అయినా జట్టు యాజమాన్యం , కోచ్ కుమార సంగక్కర, కెప్టెన్ సంజూ శాంసన్ అతడిపై నమ్మకం ఉంచారు. తనను కంటిన్యూ చేస్తూ వచ్చారు.
తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు యశస్వి జైశ్వాల్. ఏకంగా ముంబై ఇండియన్స్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. 9 ఫోర్లు 7 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. 65 బంతుల్లో 104 రన్స్ చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్బంగా మ్యాచ్ అనంతరం యశస్వి జైశ్వాల్ మీడియాతో మాట్లాడాడు.
సంజూ శాంసన్ ను ప్రశంసలతో ముంచెత్తాడు. తను అందించిన సహకారం మరిచి పోలేనన్నాడు. అంతే కాదు తనను ముందుండి నడిపిస్తున్న జట్టు కోచ్ సంగక్కర గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నాడు.