NEWSANDHRA PRADESH

టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ

Share it with your family & friends

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బిగ్ షాక్

అమార‌వ‌తి – ఏపీలో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. జంపింగ్ జపాంగ్ లు ఎక్కువై పోయారు. ఎవ‌రు ఏ నేత ఎప్పుడు ఎక్క‌డ ఏ పార్టీలో ఉంటున్నారో తెలియ‌డం లేదు. జ‌నం పోల్చుకోలేక పోతున్నారు. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మికి చెందిన నేత‌లు ప‌లువురు వైసీపీలో చేరారు. ఇవాళ జ‌న‌సేన‌, టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకున్నారు.

తాజాగా బుధ‌వారం మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ , వైసీపీ ఎమ్మెల్సీ మ‌హ‌మ్మద్ ఇక్బాల్ బిగ్ షాక్ ఇచ్చారు జ‌గ‌న్ రెడ్డికి. తాను వైసీపీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ చీఫ్‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ కండువా క‌ప్పుకున్నారు.

ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఇక్బాల్. రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న కొన‌సాగుతోంద‌ని ఆరోపించారు. అందుకే తాను పార్టీని వీడాల్సి వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు రాష్ట్రంలో ప్ర‌జ‌లు స్వేచ్ఛ‌గా బ‌తికే ప‌రిస్థితులు లేవ‌న్నారు.

చంద్ర‌బాబు నాయుడు అద్భుత‌మైన విజ‌న్ క‌లిగిన నాయ‌కుడు అని ప్ర‌శంస‌లు కురిపించారు ఇక్బాల్.