ఏపీని నాశనం చేసింది బాబే
ఆరోపించిన వైసీపీ
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసని వైసీపీ పేర్కొంది. గత కొంత కాలం నుంచి చంద్రబాబు, తనయుడు నారా లోకేష్ అధికారం తమకే వస్తుందన్న భ్రమలో ఉన్నారంటూ ఆరోపించింది. ప్రజలు నవ రత్నాల కోసమైనా తమ పార్టీని గెలిపిస్తారన్న నమ్మకం తమకు ఉందని స్పష్టం చేసింది.
ఇసుక మాఫియా , మద్యం మాఫియా, డ్రగ్స్ మాఫియా, భూ కుంభకోణాలు ఎక్కువగా చంద్రబాబు నాయుడు పాలనా కాలంలోనే కొనసాగాయని, దీనిని మరిచి పోతే ఎలా అని ప్రశ్నించింది వైసీపీ. అభివృద్ది లేమి బాబు పరిపాలనలో ప్రారంభమైందని ధ్వజమెత్తింది.
నారా చంద్రబాబు నాయుడు హయాంలో విశాఖ నగరానికి ఏమైనా ఐటీ సంస్థలు వచ్చాయా అని నిలదీసింది. రాష్ట్ర రాజధాని అప్పుడు ఇప్పుడు హైదరాబాద్ గానే ఉందని పేర్కొంది. మైనింగ్ మాఫియా పెట్రేగి పోయింది చంద్రబాబు పాలించిన సమయంలోనే కొనసాగిందని వెల్లడించింది.