తెలంగాణకు నష్టం జరిగితే ఊరుకోం
ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వార్నింగ్
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ కావడాన్ని స్వాగతించారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం ఏ మాత్రం కలిగించేలా నిర్ణయాలు తీసుకున్నా ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరూ మిత్రులా లేక గురు శిష్యులా అన్నది తమకు అనవసరమని కానీ తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ఇప్పటికే ఉమ్మడి ఏపీ కారణంగా తెలంగాణ దిక్కు లేనిదిగా మారిందన్నారు. ఈ సమయంలో పదేళ్ల తర్వాత తిరిగి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకుందామనే నెపంతో తెలంగాణకు నష్టం చేకూర్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తే మౌనంగా ఉండలేమన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
తమకు ఈ ప్రాంత ప్రయోజనాలే ముఖ్యమని, ఇప్పటికే వనరుల విధ్వంసం కొనసాగుతూ వచ్చిందన్నారు.